పేపర్ బాయ్ కు దారిచ్చిన నాగ చైతన్య..!

-

నాగ చైతన్య మారుతి కాంబినేషన్ లో వస్తున్న శైలజా రెడ్డి అల్లుడు సినిమా ఈ నెల 31న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కేరళ వరదల కారణంతో అక్కడ మ్యూజిక్ డైరక్టర్ అయిన గోపి సుందర్ సినిమాకు అందించాల్సిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేట్ చేశాడట. అక్కడ పరిస్థితులు బాగాలేని కారణంగా సినిమాను అనుకున్న టైంకు రిలీజ్ చేయట్లేదని తెలుస్తుంది.

ఫైనల్ గా సెప్టెంబర్ 13న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. చైతు సరసన అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఇక ఈ సినిమా రిలీజ్ వాయిదా పడటంతో ఆ స్థానంలో పేపర్ బాయ్ సినిమా రిలీజ్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ముందు సెప్టెంబర్ 7న రిలీజ్ అనుకోగా శైలజా రెడ్డి అల్లుడు వాయిదా పడేసరికి మళ్లీ రిలీజ్ డేట్ మార్చేశారు.

సంపత్ నంది ప్రొడక్షన్స్ లో ఆయన కథ, స్క్రీన్ ప్లే అందించిన సినిమా పేపర్ బాయ్. ఈమధ్య రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. చైతు ఆగిపోవడం వల్ల పేపర్ బాయ్ కు లైన్ క్లియర్ అయ్యింది. జయశంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నాగ శౌర్య నర్తనశాలకు పొటీగా వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news