బీఆర్ఎస్ భవిష్యత్తు మీద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని కీలక కామెంట్స్ చేశారు బిఆర్ఎస్ లో తెలంగాణ సెంటిమెంట్ లేదని అన్నారు. కారు పార్టీ నిలబడటమే కష్టంగా ఉందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎలా కృంగిపోయిందో బీఆర్ఎస్ పరిస్థితి కూడా అలానే ఉందన్నారు. కమ్యూనిస్టులు ఉంటేనే ఇండియా కూటమికి స్ట్రెంత్ అని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఒక ఎంపీ స్థానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నల్లగొండ ఖమ్మం పెద్దపల్లి భువనగిరి అలానే వరంగల్ స్థానాలని కావాలని అడిగినట్లు కూనంనేని క్లారిటీ ఇచ్చేసారు కమ్యూనిస్టులు ఏకంగా కావాలని రేపు జరగబోయే ఎంపీ ఎన్నికల్లో సత్తా చాటాలని అన్నారు. ఖమ్మం మొదటి నుండి కమ్యూనిస్టులు కంచుకోట అన్నారు. తక్కువ ఓట్లు వచ్చాయని సిపిఎం ని తక్కువ అంచనా వేయొద్దని అన్నారు ప్రజాపందా ఆధ్వర్యంలో విప్లవ పార్టీలు ఏకంగా కావడం శుభపరిణామం అని అన్నారు కాంగ్రెస్ పార్టీతో భవిష్యత్తులో స్నేహం కొనసాగుతుందని చెప్పారు.