నులిపురుగుల సమస్యకు కుపింటఆకు..మలబద్ధకంకు నెం.1 సొల్యూషన్..!

-

ప్రేగుల్లో నులిపురుగుల పెరిగిపోవడం మీరు వినే ఉంటారు. అపరిశుభ్రమైన ఆహారం, కలుషితమైన వాటర్ తాగటం వల్ల ఈ సమస్య ఉంటుంది. ఇవి ప్రేగుల్లో ఎక్కువైతే.. మనం తిన్న ఆహారాన్ని అవి తింటాయి.- ఎదిగే పిల్లల్లో ఈ సమస్య ఉంటే అది వారి ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుంది. రక్తహీనత సమస్య కూడా వస్తుంది. నులిపురుగులను తగ్గించుకోవడానికి.. రకరకాల మందులు వాడతారు. కానీ కొందరికి ఇవి ఒక పట్టాన వదలవు.. రిపీటెడ్ గా వస్తాయి. అలాంటప్పుడు నాచురల్గా తగ్గించుకునే మార్గాలను ఫాలో అ‌వడం ఉత్తమం.

కుపింట ఆకు.. ఈ పేరు కూడా మీరు విని ఉండరు. కానీ మార్కెట్లోనూ, ఆయుర్వేదం షాపుల్లో ఇవి దొరుకుతాయి. ఈ ఆకులను నీళ్లలో వేసి మరిగించి డికాషన్ చేసుకుని కాఫీ తాగినట్లు తాగితే.. నులిపురుగులు చనిపోతాయ్ అని.. యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ మలేషియా(University Of Technology Malaysia- 2017) వారు పరిశోధన చేసి నిరూపించారు. 14 పరిశోధనల సారాంశాన్ని సంగ్రహించి వీళ్లు ఈ పరిశోధన చేశారు.

గర్భవతులు మాత్రం ఈ ఆకు డికాషన్ తాగకూడదు.. ఎందుకంటే దీనివల్ల అబాషన్ అయ్యే అ‌వకాశం ఉందని సైంటిస్టులు చెప్తున్నారు. కాబట్టి వాళ్లకు ఒకవేళ నులిపురుగులు సమస్య ఉన్నా సరే.. వాళ్లు ఈ ఆకు డికాషన్ తీసుకోకూడదు.

ఈ ఆకు డికాషన్ ను కొన్నిరోజులు తీసుకోవటం వల్ల పొట్టలో నులిపురుగులు చనిపోతాయ్. 10రోజులు తాగితే చాలు.. ప్రేగులు క్లీన్ అవుతాయి.

మోషన్ సమస్య కూడా ఈరోజుల్లో చాలామందికి ఉంటుంది. ముప్పతిప్పలు పడతారు. ఇలా మలబద్ధకం తీవ్రంగా ఉన్నవారికి.. ఈ కుపింటఆకును పేస్ట్ చేసి మలద్వారం దగ్గర పెట్టేయండి.. ఆ ఇరిటేషన్ ను ప్రేగుల్లో కదలికలు పెంచేసి.. గడ్డకట్టిన మలం అంతా.. వచ్చేస్తుంది. 10-12 నిమిషాల్లోనే మోషన్ వస్తుందని సైంటిఫిక్ స్టడీస్ చెప్తుంది. ఈ సమస్యకు ఇంగ్లీష్ మందులును మలం ద్వారం లోపల పెడుతుంటారు. దీనివల్ల మంచి ఫలితం ఉన్నప్పటికీ.. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది నాచురల్గా అదే పద్దతిలో చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.

కొందరికి ఆహార నియమాలు పాటించినా, సరిపడా వాటర్ తాగిన మలవిసర్జన సరిగ్గా కాదు. అలాంటి వారు ఎనిమా చేసుకుంటే సమస్య తీరుతుంది. కానీ…అది అందరూ చేసుకోలేరు. ఇదైతే సింపుల్ గా అయ్యే పని.

చంటిపిల్లలు కూడా మలబద్ధకంతో ఇబ్బంది పడుతుంటారు. వాళ్లకు కూడా ఈ టెక్నిక్ ను పేరెంట్స్ చేయొచ్చు. ముసలివారికి ఈ పద్దతి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే వారే ఎక్కువగా ఈ సమస్యతో బాధపడతారు. వాళ్లు ఎక్కువ టాబ్లెట్స్ వాడతారు, నీళ్లు సరిపడా తీసుకోరూ.. కాబట్టి ఈ టెక్నిక్ తో సులభంగా పని అయిపోతుంది కాబట్టి.. ఆయుర్వేదం షాపుల్లో ఇవి అందుబాటులో ఉంటాయి.. తెచ్చుకుని వాడుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news