టీఆర్ఎస్ పార్టీలో చేరడంపై… టిటిడిపి మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ మరోసారి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ లో మారిన రాజకీయ పరిస్థితిలో టిడిపి పార్టీ కి రాజీనామా చేసానని స్పష్టం చేశారు. తెలంగాణా సీఎం కేసీఆర్ స్వయంగా… తనను టిఆర్ఎస్ లోకి ఆహ్వానించారని పేర్కొన్నారు.
మరో రెండు లేదా మూడు రోజుల్లో అనుచరులతో కలిసి టిఆర్ఎస్లో చేరుతానని వెల్లడించారు ఎల్ రమణ. ఎటువంటి పదవులు టిఆర్ఎస్ పార్టీ ఆఫర్ చేయలేదని చెప్పిన ఎల్ రమణ…. తనకు పదవి ఇవ్వాలని… ఎలాంటి డిమాండ్లు పెట్టలేదని స్పష్టం చేశారు. టిఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలను చూసి చాలామంది నాయకులు చేరుతున్నారని… టిఆర్ఎస్ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని తెలిపారు. తెలంగాణ అభివృద్దే ధ్యేయంగా… తాను కూడా టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు వెల్లడించారు. కాగా టీటీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణ ఇవాళ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి పంపారు. 30 ఏళ్లుగా తోడ్పాటు అందించిన చంద్రబాబుకు ధన్యవాదాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.