ఉద్యోగుల‌కు కేంద్రం శుభ‌వార్త.. నిరుద్యోగ భృతి నిబంధ‌న‌లు స‌డ‌లింపు..!

-

కరోనా సంక్షోభం కారణంగా గత నాలుగు నెలల్లో భారతదేశంలో లక్షలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం వారికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేందుకు మొగ్గుచూపుతోంది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అతి త్వరలోనే దేశంలోని నిరుద్యోగులకు తోడుగా ఉండే స్కీమ్స్ లో కొద్దిగా సవరణలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పథకం కింద నిరుద్యోగ భృతిని పొందుతున్న వారికి చివరిగా డ్రా చేసిన వేతనాలలో 50% వరకు ప్రయోజనాల పరిమాణాన్ని పెంచడం…. అలాగే సహాయక వ్యవధిని ఆరు నెలలకు రెట్టింపు చేయడం వంటి అంశాలను మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది.

ESIC పథకం వ‌ర్తించే కార్మికులకు నిరుద్యోగ భీమాను అందిస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు రెండేళ్ళు ప‌నిచేసిన కార్మికుల‌కు, నెలవారీ జీతంలో 25 శాతం నిరుద్యోగ భృతిగా మూడు నెలల పాటు ఇస్తూ వ‌చ్చింది. అయితే కొత్త‌గా తీసుకుబోయే నిబంధ‌న‌ల‌తో.. ఉద్యోగి పొందిన చివ‌రి నెల జీతంలో 50 శాతం ప్ర‌యోజ‌నం పొందేలా నిబంధ‌న‌ల‌ను రూపొందిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఇంకా మద్దతు వ్యవధిని మూడు నుంచి ఆరు నెలల వరకు రెట్టింపు చేయాలని కూడా ఈ ప్రతిపాదనలో పొందుప‌రిచింది.చందాదారుడు జీవితకాలంలో ఒకసారి మాత్రమే ప్రయోజనం పొందవచ్చు. నిరుద్యోగ భృతి జీవితకాలంలో ఒకసారి మాత్రమే పొందవచ్చని, తద్వారా దాని పదవీకాలాన్ని పెంచుకోవచ్చనే షరతును తొలగించాలని కార్మిక మంత్రిత్వ శాఖ సిఫార్సు చేస్తుంది.

ఈ ప్రతిపాదనను ఆగస్టు 20 న కార్పొరేషన్ సమావేశానికి ముందు ప్రవేశపెట్ట‌నున్న‌ట్లు తెలుస్తుంది.ఒక వేళ ఈ ప్ర‌తిపాద‌న‌ల‌ను ఆమోదిస్తే, 32 మిలియన్లకు పైగా ESIC చందాదారులకు ప్రయోజనం ఉంటుంది.

ఉద్యోగ నష్టాలు సంభవించినప్పుడు ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి ప్రస్తుత నిబంధనలలో మార్పుల ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రించ‌డంతో ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఓ) ఈ ప్ర‌తిపాద‌న‌కు ఆమోదం తెలిపింది. ఇక అదేవిధంగా ఇతర దేశాలలో నిరుద్యోగ భత్యాల తరహాలో అందరికీ ఉపయోగపడేలా ఒకే పథకాన్ని అమలులో చేసే ప్రక్రియను అనుసరించేలాగా నిబంధనలు ఉండేలా ఉంటే మంచిద‌ని పిఎంఓ మాట‌గా తెలుస్తుంది.

‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ’ మాత్రం దాదాపు 10కోట్ల 20 లక్షల మంది ఏప్రిల్ నెలలో తమ ఉద్యోగాలను కోల్పోయినట్లు అంచనా వేశారు. ఆ తర్వాత వారికి మరలా పని కల్పించే ప్రక్రియ మే, జూన్ మాసాల్లో జరిగినట్లు తెలిపారు. మొత్తం మీద ఈ రెండు నెలలు కలిపి 9 కోట్ల పది లక్షల మంది తిరిగి ఉద్యోగాల్లో చేరగా…. వారిలో ఎక్కువ శాతం మంది జూన్ నెలలోనే మరలా ఉద్యోగంలో చేరినట్లు తెలిపారు.

ఇప్పటికే ‘అటల్ భీమా వ్యక్తి కళ్యాణ్ యోజన’ కింద ఈఎస్ఐసి సబ్స్చ్రైబర్స్ లో.. ప్రభుత్వం ఉద్యోగాలు కోల్పోయిన వారికి వారి నెలసరి ఆదాయం లో నుండి 25 శాతం మొత్తాన్ని చెల్లిస్తుంది. కానీ అది ఇప్పుడు మారే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version