మైనర్ ను ఎత్తుకెళ్లి పెళ్లి..యువతి పై కేసు నమోదు..!

మైనర్ లను నమ్మించి పెళ్లి చేసుకుంటే పురుషులపై మాత్రమే కాదు స్త్రీ లపై కూడా కేసులు నమొదవుతాయి. తాజాగా అలాంటి ఘటనే తమిళనాడు లో చోటు చేసుకుంది. పొల్లాచి కి చెందిన ఓ యువతి (19) ఓ పెట్రోల్ బ్యాంకులో పనిచేస్తుంది. అదే పెట్రోల్ బంకు కు రోజూ పెట్రోల్ పోయించుకునెందుకు వచ్చే ఇంటర్ విద్యార్థి (17)కు మాయ మాటలు చెప్పి బుట్టలో వేసుకుంది. ఇటీవల విద్యార్థి ఆస్పత్రి పాలవ్వగా దగ్గరుండి చూసుకుంది.

ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక మనల్ని విడదీయకూడదు అంటే పెళ్లి చేసుకోవాల్సిందే అని విద్యార్థికి చెప్పి పళని ఆలయానికి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుంది. అనంతరం ఇద్దరూ కలిసి కోయంబత్తూరు లో కాపురం పెట్టారు. కాగా తమ కొడుకుని ఎత్తుకెళ్లి వివాహం చేసుకుంది అని తల్లి దండ్రులు యువతిని పై కేసు నమోదు చేశారు. దాంతో యువతి పై ఫొక్సో చట్టం కింద కేసు నమోదు అయ్యింది. అయితే యువతి మాత్రం తాము ఒకరినొకరు ప్రేమించుకున్నాం అని అందుకే ఇంటి నుండి పారిపోయి పెళ్లి చేసుకున్నామని చెబుతోంది.