కరోనా: వ్యాక్సినేషన్ లో సరికొత్త రికార్డు నెలకొల్పిన ఇండియా

-

కరోనాపై ఇండియా పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సాగుతుంది. ప్రపంచంలోనే ఇంత పెద్ద సంఖ్యలో మందికి వ్యాక్సినేషన్ జరగడం మన దేశంలోని తొలిసారి. కరోనా మహమ్మారి, దాని వేరియంట్లను ఎదుర్కోవడానికి శుభ్రత పాటించడం, రోగనిరోధక శక్తి పెంచుకోవడం, కోవిడ్ నిబంధనలు పాటించడం సహా వ్యాక్సినేషన్ అత్యంత ప్రాధాన్యమైనది. ఐతే కరోనా వ్యాక్సినేషన్ లో ఇండియా సరికొత్త రికార్డును నెలకొల్పింది.

ఒక్కరోజులో కోటి 9లక్షల మందికి వ్యాక్సిన్ వేస్తున్నట్లుగా కేంద్రం ప్రకటించింది. ఐదురోజుల వ్యవధిలో ఇది రెండవ సారని కేంద్రం వెల్లడించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా మొదటి డోసులు 50కోట్ల మందికి పైగా వేసారు. అలాగే సెకండ్ డోసులు 14కోట్ల మందికి పైగా తీసుకున్నారు. వ్యాక్సినేషన్ లో వేగం, ప్రజలందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి ఉండడంతో ఇలాంటి ఫలితాలు తొందరగా అందుతున్నాయని కేంద్రం వివరించింది.

Read more RELATED
Recommended to you

Latest news