బ్రేకింగ్ : రఘునందన్ రావు మీద ఆరోపణలు చేసిన మహిళ ఆత్మహత్యాయత్నం

మొన్న దుబ్బాక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన బీజేపీ నేత రఘునందన్‌రావు తనపై అత్యాచారం చేశాడని మెదక్‌ జిల్లాకు చెందిన రాధారమణి అనే మహిళ గతంలో సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమె చేసిన ఆరోపణలను రఘునందన్ కూడా ఖండించారు. ఈ ఏడాది మొదట్లో కూడా సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ను కలిసి వినతిపత్రాన్ని అందచేసింది. 2007లో రఘునందన్‌రావు తనని ఆఫీసుకు పిలిపించుకుని కాఫీలో మత్తుమందు కలిపి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదు చేసింది.

అంతే కాదు తనకు ప్రాణహాని కూడా ఉందని ఆమె అప్పట్లో చేసిన ఫిర్యాదు సంచలనం రేపింది. అయితే ఆమె ఇప్పుడు ఆత్మహత్యాయత్నం చేయడం సంచలనంగా మారింది. రఘునందన్ తో పాటు పలువురు తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఆమె మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెబుతున్నారు. అత్యాచారం కేసులో తనకు న్యాయం చేయడం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే రామ చంద్రాపురం పోలీసులు ఆమెకు రహస్యంగా చికిత్స చేయించి ఇంటి దగ్గర దించినట్టు తెలుస్తోంది. ఈ అంశం మీద పూర్తి వివరాలు అందాల్సి ఉంది.