దీపావళినాడు ఈ మంత్రాన్ని జపిస్తే?

-

దీపావళి.. సంపదకు.. సిరులకు ప్రతీకగా నిలిచే పండుగ. ఈ పండుగ శుభాకాంక్షలు ఎలా చెప్పాలంటే.. ఉదయాన్నే లేచి స్నానమాచరించి బంధువులకు, సన్నిహితులకు పిండివంటలతో పాటు శ్రీ లక్ష్మీ స్తోత్ర పుస్తకాలు పంచాలి. దీపావళి నాడు ఇలా చేయడం వలన లక్ష్మీ కటాక్షం ఒనగూరుతుందని పండితుల అభిప్రాయం. దీర్ఘకాలంగా బాకీలు ఉండి వాటి నుంచి ముక్తి పొందాలంటే.. ఈ పండుగ నాడు శ్రీలక్ష్మీదేవికి నిత్యపూజలు లేదా శ్రీ ధనలక్ష్మీ నిత్య పూజలు చేయవలసి వుంటుంది. ఈ రోజు లక్ష్మీదేవి కుబేర వ్రతాన్ని ఆచరించి సుమంగళి స్త్రీలకు ఇంటికి విచ్చేసే వారికి పసుపు, కుంకుమలతో పాటు వస్ర్తాదులను దానం చేయాలి.

ఇలా చేయడం వలన సకల సంపదలు, సౌభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఇక.. దీపావళి రోజు ఆలయాల్లో జరిపే శ్రీ మహాలక్ష్మీ కుంకుమార్చన, శ్రీ మహాలక్ష్మీకి 108 కలువ పువ్వులతో పూజలు చేస్తే ఐశ్వర్యంతోపాటు పుణ్యం లభిస్తుందని పండితులు పేర్కొంటున్నారు. వెండితో తయారుచేసిన ద్వీపాలలో ఆవునెయ్యి వేసి తామరవత్తులతో ద్వీపాలను వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇదే రోజున సాయంత్రం ఆరుగంటల సమయంలో నుదుట కుంకుమను దిద్దుకుని, పూజగదిలో రెండు పంచముఖ దీపపు సెమ్మెలలో తామర వత్తులను అమర్చి వెలిగించాలి. తరువాత ఇంటి నిండా ద్వీపాలు వెలిగించి ఓం మహాలక్ష్మీ దేవ్యైనమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ మంత్రాన్ని స్మరించడం వలన ఆ గృహం ఎల్లప్పుడూ ఆనందాలలో వెల్లువిరుస్తుందని చెప్తున్నారు.
– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news