నవంబర్ 12 వ తేదీని గురి పెట్టిన “లక్ష్య”

యంగ్ హీరో నాగ శౌర్య కథానాయకుడిగా లక్ష్య సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ లక్ష్యం మూవీ ధీరేంద్ర సంతోష జాగర్లమూడి దర్శకత్వంలో జరిగే ఎక్కుతోంది. ఈ సినిమాలో హీరో నాగ శౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. సోనాలి నరంగ్ సమర్పణలో… ఈ సినిమాను నారాయణ దాస్ నారంగ్, పుసులూరు రామ్మోహన్ మరియు శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి అండ్ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ ల మీద ఈ సినిమా తెరకెక్కుతోంది. భారతదేశ ప్రాచీన విద్య ఆర్చరీ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్, ఎంటర్టైనింగ్ వే, ఎంగేజ్ ఇంగ్ కథాంశం తో లక్ష్యం మూవీని తెరకెక్కించారు దర్శకుడు ధీరేంద్ర సంతోష్ జాగర్లమూడి.

ఇక ఇందులో రెండు వైవిధ్యమైన లుక్స్ తో కనిపించనున్నాడు నాగశౌర్య.ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాను నవంబర్ 12వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ను కూడా వదిలి చిత్రబృందం.