ఇద్దరు యువతులు స్కూటీ పై వెళుతుండగా స్కూటీ టైర్లు పంక్చర్ అయ్యాయి. దాంతో యువతులు ఇద్దరూ రోడ్డుపై నిలుచున్నారు. అదే రోడ్డుపై వెళుతున్న ఆకతాయిలు బైక్ ను ఆపి యువతులతో అసభ్యంగా ప్రవర్తించారు. దాంతో ఓ యువతి వెంటనే దిశ యాప్ ను ఉపయోగించింది. వెంటనే రంగంలోకి దిగిన గుంటూరు రూరల్ పోలీసులు ఆకతాయిలను పట్టుకున్నారు. యువతి యాప్ పై క్లిక్ చేసిన కేవలం ఎనిమిది నిమిషాల్లోనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆకతాయిలకు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. గుంటూరు రూరల్ పోలీసులను గౌతమ్ సవాంగ్ ప్రశంసించారు. ఇక ఏపీలో మహిళలపై వరుస దారుణాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దిశ యాప్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ లో ఎస్ ఓ ఎస్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే క్షణాల్లో వచ్చి రక్షిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇక యాప్ ప్రతి ఒక్కరూ కూడా డైన్లోడ్ చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం ముందు నుండి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.
సూపర్ “దిశ”..8నిమిషాల్లో ఆకతాయిల ఆటకట్టు..!
-