టీఆర్‌ఎస్ లో చాలా మంది కట్టప్పలు ఉన్నారు…. టీఆర్‌ఎస్‌ను కూల్చేందుకు రెడీ అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్. తెలంగాణ ప్రాంతం నుంచి మొట్టమొదటి రాజ్యసభ్యుడిగా యూపీ నుంచి అవకాశం ఇచ్చినందుకు పీఎం మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా, యోగి లకు ధన్యవాదాలుచెప్పారు. బిజిపి మిషన్ దక్షిన్ పేరుతో ప్రత్యేక దృష్టి పెట్టారని.. బిజిపి పెద్దోళ్ల కంటే పేదోళ్లకే ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు.
రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నిక లాంఛనమేనని.. కొన్ని ప్రాంతీయ పార్టీలు రాష్ట్రపతి అభ్యర్థి గెలుపును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బిజెపి మట్టిలో మాణిక్యాలను గుర్తిస్తున్నారు….కేసీఆర్ తెలంగాణ ను దోచుకున్నది చాలదని, కేంద్ర రాజకీయాల్లో కి వస్తాడట అని సెటైర్ వేశారు.
కేసీఆర్ అబాసుపాలు అవుతున్నారు… పివి పేరు చెప్పి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయం చేశారు… ఇపుడు పివిని పట్టించుకునే పరిస్థితి లేదని ఆగ్రహించారు. కేసీఆర్ కు వణుకు పుట్టింది… కేసీఆర్ ఆయన కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహించారు. ముందస్తు ఎన్నిలకు పోవాలా అని కేసీఆర్ ఆలోచిస్తున్నారు… అసెంబ్లీ రద్దు మాత్రమే మీ పని.. ఎన్నికలు నిర్వహించేది ఎన్నికల కమిషన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలకె బిజెపి మద్దతు అన్నారు.