ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నిత్యం ప్రజల్లో ఉంటూ మార్నింగ్ వాక్ తో పార్కుల్లో సందర్శిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. దాదాపుగా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతుగా కృషి చేస్తారు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. హుడా చైర్మన్ గా, ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా ప్రజలందరికీ పరిచయమే.
తొలిసారి 2009లో వైఎస్ హయాంలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో సుధీర్ రెడ్డి ఓడిపోయారు. 2019లో కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించి బీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. వారం రోజుల కిందట చికన్ గున్యాకు గురయ్యారు. తాజాగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి కోవిడ్ సోకినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే గత కొద్ది రోజుల నుంచి ప్రజల్లో తిరగడం లేదనే పలువురు పేర్కొంటున్నారు.