రాజ్యసభ శీతాకాల సమావేశాల ఎంపీలను సస్పెండ్ చేయడంపై ప్రతిపక్ష పార్టీల నేతలు సంయుక్త ప్రకటనలో ఖండించారు. 12 మంది ఎంపీలను శీతాకాల సమావేశాల మొత్తానికి సస్పెండ్ చేయడం అసమంజసం, అప్రజాస్వామికమని విమర్శించారు. ఇది రాజ్యసభ నిబంధనల విరుద్ధమని ఆరోపించారు. గత ఆగస్టులో జరిగిన వర్షాకాల సమావేశాల్లో అనుచితంగా ప్రవర్తించినందుకు కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు, తృణమూల్ కాంగ్రెస్ 2, శివసేన 2, సీపీఎం, సీపీఐల నుంచి ఒక్కొక్కరి చొప్పున సస్పెన్షన్‌కు గురైన విషయం తెసిందే.
గత సమావేశాల్లో జరిగిన అనూహ్య సంఘటన ఉద్దేశించి మొత్తం శీతాకాల సమావేశాలకు సభ్యులను రాజ్యసభ నిబంధనలను ఉల్లంఘిచడమే కాకుండా రాజ్యసభ బిజినెస్ రూల్స్‌కు విరుద్ధమని ప్రతిపక్ష పార్టీల సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ విషయమై మంగళవారం ప్రతిపక్ష పార్టీ నేతలు సమావేశమై తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు. సంయుక్త తీర్మానంపై కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ, ఎన్‌సీపీ, ఆర్జేడీ, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్, ఎల్‌జేడీ, జేడీఎస్, ఎండీఎంకే, టీఆర్‌ఎస్, ఆప్ నేతలు సంతకాలు చేశారు.