నమ్మించి మోసం చేసిన కూటమి నేతలను 420 అంటారు అని సీఎం జగన్ పేర్కొన్నారు. తాజాగా సీఎం జగన్ విజయనగరం జిల్లాలోని చెల్లూరు నిర్వహించిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో మాట్లాడారు. నారా సైన్యానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒకరు ప్రత్యక్ష్యంగా.. మరొకరూ పరోక్షంగా మద్దతు ఇస్తున్నాయి. పెత్తందారులకు, కౌరవ సభకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం అన్నారు.
చంద్రబాబు వెనుక దత్త పుత్రుడు ఉన్నాడు. చంద్రబాబు వెనుక బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయి. రూ.2లక్ష 70వేల రూపాయలను నేరుగా ప్రజల ఖాతాల్లో వేయనున్నారు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల భవిష్యత్ అన్నారు. పేద ప్రజల గురించి ఏ ఒక్క రోజు చంద్రబాబు ఆలోచన చేయలేదు అన్నారు. ఇంత మంది తోడేళ్లు ఏకమై నా మీదకు యుద్ధానికి వస్తున్నారని పేర్కొన్నారు.