రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమా నుంచి లీకైన ఫోటోలు… నెట్టింట వైరల్

-

తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటుంది.ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం కోసం మెగా అభిమానులు చాలాకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గేమ్ చేంజర్ రాంచరణ్ నటిస్తున్నటువంటి 15వ చిత్రం. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు అందించినటువంటి పొలిటికల్, డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రాబోతుంది. ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో శ్రీకాంత్, అంజలి, సునీల్, సముద్ర ఖని, నవీన్ చంద్ర తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఇదిలా ఉంటే… ఈ సినిమా గురించి వినిపిస్తున్న ఏ చిన్న న్యూస్ అయినా నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ విశాఖపట్టణంలో జరుగుతోంది. అయితే, ఈ తరుణంలో ఈ సినిమాకు సంభందించిన స్టిల్స్ లీకు అయ్యాయి.వైజాగ్ లో తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ఎపిసోడ్ నుంచి రామ్‍చరణ్ ఫొటోలు కొన్నిలీక్ అయ్యాయి. వీటి ద్వారా ఈ చిత్రంలో రామ్‍చరణ్ కొత్త లుక్ లో కనిపిస్తున్న ఫొటోలు, వీడియోలు నెట్టింట్లా వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news