రాజ్ భవన్ వద్ద ఉన్న కోల్కతా పోలీసు సిబ్బంది పనితీరుపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి. వి. ఆనంద బోస్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే వారిని కార్యాలయం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. బాధితులతో కలిసి తనను కలిసేందుకు వచ్చిన సువేందు అధికారిని పోలీసులు అడ్డుకోవడమే అందుకు కారణమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
లోక్ సభ ఎన్నికల అనంతరం జరిగిన హింస బాధితులతో కలిసి రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ఇటీవల రాష్ట్ర గవర్నర్ సి. వి. ఆనంద బోసు కలిసేందుకు వెళ్లారు. అయితే.. ఆయనను అక్కడున్న పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు. రాజ్ భవన్ వెలుపల 144 సెక్షన్ అమలులో ఉన్నందున గుంపుగా రావడాన్ని అనుమతించమని తేల్చి చెప్పారు. గవర్నర్ ని కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా తీసుకున్నానని.. బాధితులకు న్యాయం చేయాలని కోరేందుకే వచ్చామని ఎంత చెప్పినా వినిపించుకోలేదు.