నేను ఏ పార్టీలో చేరడం లేదు.. హరీశ్ రావు క్లారిటీ

-

బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు త్వరలో బీఆర్ఎస్​ను వీడి బీజేపీ అయినా లేదా కాంగ్రెస్ పార్టీలో అయినా చేరతారంటూ చాలా రోజుల నుంచి పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ రూమర్స్​్పై హరీశ్ రావు స్పందించారు. తెలంగాణ భవన్​లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలోని నిరుద్యోగులు, గ్రూప్-1 అభ్యర్థులు, విద్యార్థుల సమస్యలపై మాట్లాడిన ఆయన చివరలో తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వదంతులపై మాట్లాడారు.

ఈ సందర్భంగా యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకులకు హరీశ్ రావు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తాను వేరే పార్టీలో చేరుతున్నానంటూ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతున్నానంటూ వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని కొట్టిపారేశారు. లైక్స్, వ్యూస్ కోసం కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు థంబ్​నెయిల్స్ పెడుతున్నారని మండిపడ్డారు. ఇది రాజకీయ నేత నిబద్ధతను దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు. ఇలాంటివి రిపీట్ అయితే లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news