టీ తాగాక టీ బ్యాగ్స్ ను ఏం చేస్తాం.. చెత్త డబ్బలో పడేస్తాం. దాంట్లో వింతేముంది అంటారా? కానీ… ఈమె మాత్రం టీ బ్యాగ్స్ ను చెత్త డబ్బలో పడేయలేదు. ఏం చేసిందో తెలుసా? ఆ టీ బ్యాగ్స్ నుంచి అద్భుతాలు సృష్టించింది. ఈ వార్త చదివాక మీరు కూడా టీ బ్యాగ్స్ ను పడేయరు.
ఒకసారి ఉపయోగించిన టీ బ్యాగ్స్ ను చెత్తబుట్టలో పడేయకుండా… వాటిని నేలలో నాటండి. నేలలో నాటడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ఆ నేల సారవంతంగా మారుతుంది. ఇంటి వెనుక కానీ.. ఎక్కడైనా మీరు కూరగాయల మొక్కలు లేదా ఇతర మొక్కలు ఏవైనా పెట్టినప్పుడు… లేదా పెట్టాలనుకున్నప్పుడు ఆ ప్రాంతంలో వాడి పడేసిన టీ బ్యాగులను నాటండి. అవి ఆ నేలను సారవంతం చేస్తాయి. దీంతో మిగితా చెట్లు ఏపుగా పెరుగుతాయి. దిగుబడి కూడా పెరుగుతుంది. టీ బ్యాగ్స్ నాటేముందు.. అవి ప్లాస్టిక్ బ్యాగ్స్ కాకుండా చూసుకోండి.
ఇదే కాకుండా.. టీ బ్యాగ్స్ వల్ల వేరే ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఆరోగ్య పరమైన ఉపయోగాలు అవి. మీ కళ్లు బాగా అలసిపోయినట్టు అనిపిస్తే… వాటర్ లో టీ బ్యాగ్స్ ను ఓసారి తడిపి… వాటిని కనురెప్పలపై కాసేపు పెట్టండి. దాంతో మీకు ఉపశమనం కలుగుతుంది.
ఎక్కడైనా కాలితే.. టీ బ్యాగ్స్ ను ఆ ప్రాంతంలో కాసుపు ఉంచితే ఉపశమనం కలగడంతో పాటు కాలిన గాయాలు త్వరగా మానడానికి అవకాశం ఉంటుంది.
చాలామంది షూలు కంపు వాసన కొడుతుంటాయి. వాసన రాకుండా ఉండాలంటే టీ బ్యాగ్స్ ను షూ లోపల పెడితే.. షూ నుంచి వచ్చే చెడు వాసన తగ్గిపోతుంది.
కొన్ని గిన్నెలు ఎంత తోమినా.. వాటికి ఉన్న మురికి అస్సలు పోదు. గిన్నెలో కొన్ని నీళ్లు పోసి దాంట్లో టీ బ్యాగ్స్ వేసి కొంచెంసేపు అలాగే ఉంచండి. తర్వాత గిన్నెలు తోమండి. అవి తళతళలాడుతాయి.
ఉల్లిగడ్డలు కోసిన తర్వాత చేతులకు ఉల్లిగడ్డల వాసన రాకుండా ఉండటం కోసం… టీ బ్యాగ్ తీసుకొని… దాంతో చేతులను కాసేపు రుద్ది ఆ తర్వాత చేతులను కడుక్కుంటే ఉల్లి వాసన పోతుంది.