ఆన్‌లైన్ క్లాసులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్..!

-

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 1న ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిజిటల్ క్లాసులు ప్రారంభించనుంది. మూడో త‌ర‌గ‌తి, ఆపై స్థాయి విద్యార్థుల‌కు ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది. కేంద్రం ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారమే ఈ త‌ర‌గ‌తులు ఉంటాయ‌ని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

టీశాట్, దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు చెప్పనున్నారు. అలాగే ఉపాధ్యాయులందరూ ఆగస్టు 27 నుంచి క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరు కావాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఇంట్లో టీవీలు లేని విద్యార్థుల కోసం గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ భవనాల్లో ఆన్‌లైన్ తరగతులు వినేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు నిర్దేశం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news