కాంగ్రెస్ పాలనలో చావు కేకలు.. రిటైర్డ్ ఏఎస్ఐ సంచలన వ్యాఖ్యలు..!

-

కాంగ్రెస్ పాలనలో చావు కేకలు వినాల్సి వస్తుందని.. 8 నెలల క్రితం రిటైర్డ్ అయి బెనిఫిట్స్ రాక ఆత్మహత్యకు సిద్దమైన రిటైర్డ్ ఎఎస్ఐ ఎం.డీ. సాధిక్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు.  పదేళ్ళు పచ్చగా ఉన్న తెలంగాణ నేడు కమురువాసన కొడుతున్నది. అభివృద్ధిలో ఆకాశం ఎత్తుకు ఎదిగిన మన రాష్ట్రం నేడు అదఃపాతాళానికి దిగజారిపోయింది. పదేళ్ళు అధికారంలేక ఆకలితో ఉన్న కాంగ్రెస్ నేతలు అందినకాడికి దండుకుంటుంటే.. ప్రజలుమాత్రం ఆత్మహత్యల పాలవుతున్నారు.

రైతులు,చేనేత కార్మికులు,నిరుద్యోగులు ఉపాధి లేక ఊపిరి వదులుతున్నారు. చివరకు రిటైర్డ్ అయిన ఉద్యోగులు కూడా బలవంతపు చావులకు సిద్దపడుతున్నారు. ఉద్యోగ విరమణ సమయంలో ఉద్యోగికి ఇవ్వాల్సిన బెన్ ఫీట్స్ కూడా ఇవ్వకుండా ఉసురు తీస్తున్నారు. మహబూబ్ నగర్ కు చెందిన రిటైర్డ్ ఎఎస్ఐ యం.డి.సాధిక్ పోలీసు డిపార్ట్మెంట్ నుండి రిటైర్డ్ అయి ఎనిమిది నెలలైనా ఎనిమిది రూపాయలు కూడా రాలేదని చావుకు సిద్దపడ్డట్టు తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Latest news