ఒక వర్క్ చేస్తున్న దగ్గరగానీ, కంపెనీలో జాయిన్ అయినపుడు గానీ అక్కడ కొలీగ్స్ కన్నా ముందే పరిచయమయ్యేది ఒత్తిడి మాత్రమే. దాన్నే ఈ మధ్య స్ట్రెస్ అంటూ స్ట్రెస్ చేసి మరీ చెబుతున్నారు. స్ట్రెస్ తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు మనుషులు. కొంత మంది జాబ్ సైతం మానేస్తున్నారు. అది పక్కన పెడితే.. జాబ్ లోని ఒత్తిడిని గానీ జీవితంలోని ఒత్తిడిని గానీ తగ్గించాలంటే కలరింగ్ టెక్నిక్ పనిచేస్తుంది.
కలరింగ్ అంటే?
ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు. చిన్నపిల్లలు కాగితాల మీద రకరకాల కలర్ పెన్స్ ఉపయోగించి ఏవేవో గీస్తుంటారు. అదే కలరింగ్. ఆ టెక్నిక్ తో ఒత్తిడిని చాలా వరకు తగ్గించుకోవచ్చు.
కలరింగ్ వల్ల ఒత్తిడి తగ్గుతుందని మానసిక వైద్యులు చెబుతున్నారు. కలరింగ్ చేసేటపుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవాలి.
ఈ ప్రక్రియ ఫాలో అయ్యే వాళ్ళు మంచి మంచి కలరింగ్ పుస్తకాలు కొనుక్కోవాలి. మార్కెట్లో చిన్న పిల్లలు కలర్లు వేసుకోవడానికి పనికొచ్చే పుస్తకాలు చాలా ఉంటాయి. వాటిని తెప్పించుకోండి. ముఖ్యంగా మంచి ప్రకృతి చిత్రాలకు కలర్స్ వేయండి.
రోజూ కొంత సమయాన్ని కలరింగ్ కోసం కేటాయించండి. ఆ సమయంలో ఫోన్‍కి దూరంగా ఉండండి. కలరింగ్ వల్ల కాన్సన్ట్రేషన్ వృద్ధి చెందుతుంది. ఫోకస్ బాగా పెరుగుతుంది. కలరింగ్ కోసం ఎక్కువగా మెరిసే కలర్ పెన్సిల్ లేదా పెన్స్ వాడండి.
కలరింగ్ చేసేటపుడు పర్ఫెక్ట్ గా చేయాలని మీకు మీరు కఠినమైన రూల్స్ పెట్టుకోవద్దు. దానివల్ల అనవసర స్ట్రెస్ కలుగుతుంది. స్ట్రెస్ పోగొట్టుకోవడానికే కలరింగ్ చేస్తున్నాం కాబట్టి రిజల్ట్ గురించి ఆలోచించవద్దు.
కలరింగ్ వేసిన వాటిని సోషల్ మీడియాలో పంచుకోండి. అవతలి నుండి ఒక్క లైక్ వచ్చినా మనస్సుకు ఉత్సాహంగా అనిపిస్తుంది. మనసులోని ఒత్తిడి తొలగిపోయి ప్రశాంతంగా ఉండగలుగుతారు.