ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భయం నుంచి బయటకు వచ్చిన తెలంగాణా ప్రజలకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఇతర రాష్ట్రాల నుంచి ఏనుగులు, పులులు తెలంగాణా బాట పడుతున్నాయి. తెలంగాణాలో అడవుల విస్తీర్ణం క్రమంగా పెరుగుతుంది. అడవులు గతంతో పోలిస్తే ఇప్పుడు పచ్చగా ఉన్నాయి. దీనితో మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పులులు తెలంగాణలోకి అడుగు పెడుతున్నాయి.
దట్టమైన అటవీ ప్రాంతాలకు దగ్గరలో ఉన్న గ్రామాల ప్రజలు ఇప్పుడు వీటి దెబ్బకు బెదిరిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్ళు అడవి జంతువుల అలజడి లేని గ్రామాలు కూడా ఇప్పుడు వాటి పుణ్యమా అని భయపడే పరిస్థితి ఏర్పడింది. అదిలాబాద్ అడవుల్లో పెద్ద పులులు అడుగుపెట్టాయి. దీనితో ప్రాణహిత పరివాహక ప్రాంతంలో పులుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అటవీ అధికారులు అప్రమత్తత అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
ఇప్పుడు కామారెడ్డి జిల్లాలో చిరుత పులుల కలకలం రేగుతుంది. కామారెడ్డి జిల్లా… లింగంపేట మండలం… భవానీపేట అటవీ ప్రాంతంలో ఈ అలజడి ఎక్కువైంది. అడవిలో ఇసుక కోసం వెళ్ళగా రెండు చిరుతపులి పిల్లలు… చెట్టు తొర్రలో కనిపించాయి. ముందు పిల్లి పిల్లలు అనుకున్నారు. కాని దగ్గరగా చూడటంతో వాటిని చూసి పులి పిల్లలు అనుకుని షాక్ అయ్యారు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు.
ఇలా తెలంగాణాలో అక్కడక్కడా పులుల హడావుడితో ప్రజలు భయపడుతున్నారు. తెలంగాణా వ్యాప్తంగా పులుల గోల ఎక్కువైంది. మొన్నా మధ్య నల్గొండ జిల్లాలో ఒక కాలేజి లో కూడా ఇలాంటి కలకలం రేగింది. దీనితో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న ప్రజలు అయితే ఎప్పుడు ఏ పులి వస్తుందో అని భయపడిపోతున్నారు.