క‌రోనా వైర‌స్ టెస్టుల కోసం దేశ‌వ్యాప్తంగా ఎన్ని ల్యాబ్‌ల‌ను, ఎక్క‌డెక్క‌డ‌ ఏర్పాటు చేశారో తెలుసా..?

-

దేశ‌వ్యాప్తంగా క‌రోనా వ‌చ్చిన వారి సంఖ్య ఇప్ప‌టి వ‌ర‌కు 42కు చేరుకున్న సంగ‌తి తెలిసిందే. సోమ‌వారం మ‌రిన్ని క‌రోనా పాజిటివ్ కేసుల‌ను గుర్తించ‌డంతో ఆ సంఖ్య 42కు చేరుకుంది. అయితే కేంద్ర ప్ర‌భుత్వం క‌రోనా వైర‌స్ నిర్దార‌ణ టెస్టుల‌కు గాను దేశ వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో 52 ల్యాబ్‌ల‌ను ఏర్పాటు చేసింది. క‌రోనా అనుమానితుల ర‌క్త న‌మూనాల‌ను సేక‌రించి ఆ ల్యాబ్‌ల‌లో వైద్యులు ప‌రీక్ష‌లు చేయ‌నున్నారు. ఇక ప్ర‌ధాన న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో క‌రోనా టెస్టింగ్ ల్యాబ్‌లు ఎక్క‌డెక్క‌డ ఉన్నాయంటే…

corona test labs in india

* ఏపీలో తిరుప‌తి శ్రీ వెంక‌టేశ్వ‌ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్, విశాఖ‌ప‌ట్నం ఆంధ్రా మెడిక‌ల్ కాలేజీ, అనంత‌పూర్ గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీ

* అస్సాంలో గౌహ‌తి మెడిక‌ల్ కాలేజీ, దిబ్రుగ‌ఢ్‌లోని రీజ‌న‌ల్ మెడిక‌ల్ రీసెర్చి సెంట‌ర్

* బీహార్‌లో పాట్నా రాజేంద్ర మెమోరియ‌ల్ రీసెర్చి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌

* చండీగ‌ఢ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రీసెర్చి

* చ‌త్తీస్‌గ‌ఢ్‌లో ఎయిమ్స్

* ఢిల్లీలో ఎయిమ్స్‌, నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్‌

* గుజరాత్‌లో అహ్మ‌దాబాద్ బీజే మెడిక‌ల్ కాలేజీ, జామ్‌న‌గ‌ర్‌లో ఎంపీ షా గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీ

* రోహ్‌త‌క్‌లో పండిట్ బీడీ శ‌ర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌

* హ‌ర్యానాలోని సోనిప‌ట్ బీపీఎస్ గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీ

* షిమ్లాలో ఇందిరా గాంధీ మెడిక‌ల్ కాలేజీ

* హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లోని కాంగ్రా, తండా డాక్ట‌ర్ రాజేంద్ర ప్ర‌సాద్ గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీ

* శ్రీ‌న‌గ‌ర్‌లో షెర్‌-ఐ-కాశ్మీర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌, జ‌మ్మూ గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీ

* బెంగ‌ళూరులోని మెడిక‌ల్ కాలేజీ అండ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌, నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ ఫీల్డ్ యూనిట్‌, మైసూర్ మెడిక‌ల్ కాలేజీ అండ్ రీసెర్చి ఇనిస్టిట్యూట్‌, హ‌స్స‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌, షిమోగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌

* కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురం నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ ఫీల్డ్ యూనిట్‌, గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీ, కోజికోడ్ గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీ

* మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బ‌ల్‌పూర్ నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ట్రైబ‌ల్ హెల్త్‌, భోపాల్ ఎయిమ్స్

* రాజస్థాన్‌లోని జైపూర్ స‌వాయ్ మాన్ సింగ్ మెడిక‌ల్ కాలేజీ, జోధ్‌పూర్ డాక్ట‌ర్ ఎస్ఎన్ మెడిక‌ల్ కాలేజీ, జ‌లావ‌ర్‌లోని గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీ, బిక‌నీర్‌లోని ఎస్‌పీ మెడిక‌ల్ కాలేజీ

* తెలంగాణ‌లోని సికింద్రాబాద్ గాంధీ మెడిక‌ల్ కాలేజీ, ల‌క్నోలోని కింగ్ జార్జ్ మెడిక‌ల్ యూనివ‌ర్సిటీ, ల‌క్నో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌, వార‌ణాసి బ‌నార‌స్ హిందూ యూనివ‌ర్సిటీ, అలీగ‌ఢ్ జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ మెడిక‌ల్ కాలేజీ

* ఉత్త‌రాఖండ్ హ‌ల్ద్వానీ గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజ్‌, కోల్‌క‌తాలోని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క‌ల‌రా అండ్ ఎంట‌రిక్ డిసీజెస్‌, ఐపీజీఎంఈఆర్

Read more RELATED
Recommended to you

Latest news