గతంలో ఇంట్లో టీవీ ఉంటే ఆ సందడే వేరు. ఇంట్లో ఎవరూ లేకపోయినా సరే టీవీ ఉంటే మనుషులు తోడు ఉన్నట్టే. ఒక్కరే అయినా సరే ఎంత సేపు అయినా సరే ఉండవచ్చు. సినిమాలు వినోదం సందడి, వార్తలు ఇలా సమాచారం తెలుసుకోవడానికి టీవీ నే ప్రధానంగా ఉంటూ వచ్చేది… కుటుంబం అంతా కలిసి టీవీ ని ఎక్కువగా వీక్షిస్తూ ఉండే వారు. మరి ఇప్పుడు…? అంతా స్మార్ట్ ఫోన్ మయం. ప్రపంచం మొత్తం అన్ని మర్చిపోయి వేళ్ళ మీద నడుస్తుంది. ఒకప్పటి సందడి, సంబరం ఇవేమీ స్మార్ట్ ఫోన్ మాయలో ప్రపంచం చూడలేకపోతుంది.
దీనితో టీవీ ల అమ్మకాలు భారీగా పడిపోయాయట. గతంలో పల్లెటూర్ల నుంచి ఎక్కువగా టీవీ లను కొనుగోలు చేసే వారు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మీద దృష్టి పెడుతున్నారు. వినోదం మొత్తం అందులోనే ఉండటంతో టీవీ కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకి రావడం లేదు. ప్రముఖ టీవీ సంస్థలు ధరలు భారీగా తగ్గించినా, అనేక ఫీచర్లు టీవీల్లో తీసుకువచ్చినా సరే ప్రజలు మాత్రం టీవీ ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. దీనితో స్మార్ట్ ఫోన్ ధర కన్నా తక్కువగా టీవీ ధరలను ఉంచడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
ఇక్కడ మరో వింత ఏంటి అంటే… స్మార్ట్ ఫోన్ కొంటె టీవీ ఇస్తామనే ఆఫర్ ని కూడా కంపెనీలు ఇస్తున్నాయి. ఇక గడియారాలను కూడా స్మార్ట్ ఫోన్ ఆక్రమించింది అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. గతంలో ఇళ్ళల్లో ఎక్కువగా గడియారాలు పెట్టుకునే వారు. కాని ఇప్పుడు మాత్రం ఫోన్ ఉంది కదా గడియారం ఎందుకు, అలారం అన్నీ వస్తున్నప్పుడు ఇంకా అవి ఎందుకు అని కొనుగోలు చేయడం లేదట. చేతి గడియారాల అమ్మకాలు కూడా భారీగా పడిపోయాయి. గతంలో వాచ్ ని ఫ్యాషన్ గా భావించే యువత ఇప్పుడు బరువు గా భావిస్తూ స్మార్ట్ ఫోన్ ని ఫ్యాషన్ గా భావిస్తుంది.