హైదరాబాద్ లో కలుద్దాం ప్రభాస్.. పూజా హెగ్డే కామెంట్..!

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకున్న పూజా హెగ్డే తన అందంతో నటనతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల వరుస సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది పూజా హెగ్డే. ఇక ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పూజ హెగ్డే కాంబినేషన్లో రాధేశ్యామ్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవలే ఈ సినిమా షూటింగులో భాగంగా చిత్రబృందం ఇటలీ వెళ్ళింది. దాదాపు అక్కడ నెల రోజుల పాటు షూటింగ్ పూర్తి చేసుకొని చిత్రబృందం మళ్లీ భారత్కు వచ్చింది. ఇటీవల ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది పూజా హెగ్డే. ఇటాలియన్ షెడ్యూలు పూర్తి చేశాము హైదరాబాద్ లో కలుద్దాం ప్రభాస్ అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది పూజా హెగ్డే. ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.