చాలా మంది నచ్చిన స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ వుంటారు. అయితే స్కీమ్స్ లో డబ్బులు పెడితే మనకి మంచిగా లాభాలు వస్తాయి. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల స్కీమ్స్ ని ఇస్తోంది. సరళ్ పెన్షన్ పేరుతో ఓ పాలసీని అందిస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే ప్రతీ నెలా కూడా పెన్షన్ వస్తుంది. ప్రీమియం చెల్లించిన వెంటనే పెన్షన్ అమలులోకి వస్తుంది. నెలవారీ ఖర్చుల కోసం పెన్షన్ పొందాలనుకునే వారికి ఇది బెస్ట్ స్కీమ్. ఇందులో చేరాలంటే కనీస వయస్సు 40 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయస్సు 80 ఏళ్లు. కనీసం నెలకు రూ.1,000, మూడు నెలలకు రూ.3,000, ఆరు నెలలకు రూ.6,000, ఏడాదికి రూ.12,000 పెన్షన్ పొందొచ్చు.
దీనిలో రెండు ఆప్షన్స్ వున్నాయి. లైఫ్ యాన్యుటీ ఆప్షన్ ఎంచుకుంటే జీవితాంతం యాన్యుటీ అంటే పెన్షన్ వస్తుంది. పాలసీహోల్డర్ మరణిస్తే చెల్లించిన ప్రీమియం నామినీకి లభిస్తుంది. ఇద్దరూ మరణించిన తర్వాత ప్రీమియం చెల్లించిన ప్రీమియం నామినీకి వస్తుంది.
60 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ఏడాదికి ఓసారి యాన్యుటీ కోసం రూ.10,00,000 సింగిల్ ప్రీమియం చెల్లించి దీనిని తీసుకుంటే ఏటా రూ.56,450 యాన్యుటీ వస్తుంది. మరణించిన తర్వాత రూ.10,00,000 నామినీకి వస్తాయి. ఇక 55 ఏళ్ల వయస్సు ఉన్న జీవిత భాగస్వామిని చేరుస్తూ ముందే జాయింట్ యాన్యుటీ ఆప్షన్ ఎంచుకుంటే జీవిత భాగస్వామికి ఏటా రూ.55,950 చొప్పున యాన్యుటీ లభిస్తుంది. అంటే పాలసీ తీసుకున్న తర్వాత నచ్చకపోతే 15 రోజుల్లో వెనక్కి ఇచ్చి ప్రీమియం డబ్బులు తీసుకొచ్చు.