లైగర్‌ బిగ్ అప్డేట్‌.. ఈ నెల 21న ట్రైలర్‌..

-

ఎప్పడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమాల్లో రౌడీబాయ్ విజయ్‌ దేవరకొండ నటిస్తున్న సినిమా ‘లైగర్‌’ ముందు వరసలో ఉంటుంది. పూరి జగన్నాథ్‌, చార్మీ, కరణ్ జొహార్ లు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో పూరి ఎక్కువ సమయం తీసుకున్నాడు. కరోనా ప్రభావం కారణంగా మరింత ఆలస్యమవుతోంది. అయితే.. బాక్సింగ్ నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమాలో బాక్సర్ గా కనిపించనున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా అనన్య పాండే పరిచయం కానుంది.

ఇక ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడాని కి ముహూర్తాన్ని ఖరారు చేశారు మేకర్స్‌. ఈ నెల 21వ తేదీన ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్‌. మైక్ టైసన్ ఈ సినిమాలో గెస్టు రోల్ లో కనిపించనున్నారు. రమ్యకృష్ణ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాలో, మకరంద్ దేశ్ పాండే .. రోనిత్ రాయ్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 25వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది చిత్ర యూనిట్‌.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version