పేదలను దోచి కార్పొరేట్లకు పంచుతున్నారు : హరీష్‌రావు

-

మరోసారి కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మంత్రి హరీష్‌రావు. తాజాగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. గోదావరికి చరిత్రలో ఎన్నడూ లేనంత వరద వచ్చిందని.. అయినా ముంపు ప్రాంతాల్లో ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామని పేర్కొన్నారు మంత్రి హరీశ్‌రావు. అయినా బీజేపీ నేతలు బురద రాజకీయం చేస్తున్నారని, తెలంగాణలో వచ్చే రెండు నెలల్లో కొత్త పెన్షన్లు, రేషన్‌ కార్డులను మంజూరు చేస్తామని.. సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలనుకునే పేదలకు ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు మంత్రి హరీశ్‌రావు.

రాష్ట్రంలో ఇప్పటికే 40 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని.. త్వరలో 57 ఏళ్లు నిండిన వారికి కొత్త పెన్షన్లు ఇస్తామని వెల్లడించారు మంత్రి హరీశ్‌రావు. తెలంగాణలో ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ఆపేస్తారని, తెలంగాణలో అమలవుతున్న అద్భుత పథకాలు ఎక్కడైనా బీజేపీ పాలిట రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు మంత్రి హరీశ్‌రావు. పేదలను దోచి కార్పొరేట్లకు పంచుతున్నారు విమర్శించారు మంత్రి హరీష్‌రావు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version