తిరుపతి వరదలపై పవన్ కళ్యాణ్ ఎమోషనల్…!

జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ ఈరోజు తిరుపతి లో పర్యటించారు. కాగా నాదెండ్ల మనోహర్ పర్యటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. తిరుపతిలో జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటించి బాధితుల గోడు విన్నారని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రభుత్వం తరఫున బాధితులకు అందుతున్న సహాయం వివరాలను తెలుసుకున్నాం అని చెప్పారు. ఇస్కాన్ అందిస్తున్న భోజనం తప్ప ఎలాంటి సహాయం అందడం లేదని బాధితులు వాపోయినట్టు తెలిసింది అని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తిరుపతిలో అనేకమంది పేదల ఇల్లు ఇప్పటికీ వరద నీటిలో నానుతున్నాయని పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు.

ప్రజలు కన్నీళ్లతో తమ బాధలు చెబుతున్నారని పవన్ తెలిపారు. జనసేన పార్టీ తరఫున నిత్యావసర వస్తువులు అందించామని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నుండి న్యాయమైన పరిహారం అందేలా బాధితుల పక్షాన నిలిచేందుకు జనసేన సిద్ధంగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తిరుపతిలో వరదల కారణంగా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.