తప్పనిసరిగా కలిసి ఉండక్కర్లేదు: సుప్రీంకోర్టు

-

సోమవారం నాడు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న వాళ్ళు కలిసి ఉండాల్సిన పని లేదు అని చెప్పింది. ఇక అసలు ఏమైంది అనేది చూస్తే.. ఒక జంట ఫిబ్రవరి 2002లో విడిపోయారు. అంటే గత 20 ఏళ్ల నుంచి కూడా వీళ్లు విడిపోయే ఉన్నారు. పైగా పెళ్లి తర్వాత కనీసం ఈ జంట ఒక్క రోజు కూడా కలిసి లేరు.

వీళ్ళు విడిపోయాక అతను మరో వివాహం చేసుకున్నాడు. అయితే విడాకుల కోసం కూడా అప్లై చేసారు. 2008లో విడాకులు గ్రాంటెడ్ అయ్యాయి. అయితే ఫిబ్రవరి 2019 లో తమిళనాడు హైకోర్టు వాటిని పక్కన పెట్టేసింది. అయితే రెండవ పెళ్లిని ఎలాగైనా రక్షించుకోవాలని సుప్రీంకోర్టుకు ఇతను వెళ్ళాడు. అయితే చాలా కాలం నుంచి మొదటి భార్య నేను విడిపోయి ఉన్నామని.. మరొక ఆమెను వివాహం చేసుకున్నానని అతను చెప్పాడు.

ఇక దీనిపై సంజయ్ కిషన్ మాట్లాడుతూ… వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి వివాహ బంధం నడవడం లేదని ఆ మహిళ తన భర్త మీద అనేక కేసులు పెట్టిందని అదే విధంగా ఆయన ఉద్యోగం పోవడానికి ఆమె కారణం అని కూడా ఆయన చెప్పారు. అయితే తన భర్త మీద ఇలా వివిధ రకాల కంప్లైంట్లు పెట్టడం వల్ల తన ఉద్యోగం కూడా లేదు అని ఆమె ఎంతో క్రూరంగా ఆలోచిస్తోంది అని అన్నారు.

అయితే ఇతని ముందు భార్య మాత్రం అతనిని వదిలేది లేదు అన్నట్లు పట్టుపట్టింది. ఎదో విధంగా హింసిస్తోంది. ఆర్టికల్ 142 ప్రకారం ఇద్దరికీ న్యాయం చేయాలని అనుకున్నారు. అయితే కలిసి ఉండాలని ఏమీ లేదు కానీ పెళ్లి అనేది ఇద్దరికీ మధ్య సంబంధించినది ఒకవేళ ఈ బంధం సెట్ కాలేదు అంటే పరిస్థితిని పోస్ట్ పోన్ చేసి ఎలాంటి ప్రయోజనం లేదు అని బెంచ్ చెప్పింది. అలానే ఆ బంధం లో తప్పనిసరిగా కలిసి ఉండక్కర్లేదు అని తీర్పు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version