లోన్ యాప్స్ కేసులో కీలక ట్విస్ట్.. ఎస్సై కొడుకే ?

-

లోన్ యాప్ ల కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. చైనా దేశస్థుడు లాంబో తో పట్టుబడ్డ నాగరాజు తండ్రి ఓ పోలీసు అధికారి అని వెలుగులోకి వచ్చింది. నాగరాజును ఢిల్లి నుంచి ఇంటికి రప్పించిన తండ్రి, తరువాత హైదరాబాద్ సైబర్ క్రైం పొలీసులకు సమాచారం ఇచ్చినట్టు చెబుతున్నారు. పోలీసులు వచ్చేంతవరకు నాగరాజు ఇంట్లో ఉండేలా చూసిన తండ్రి ఆయన్ని పోలీసులకు అప్పగించాడు.

కన్న కొడుకు కంటె కంటే విధి నిర్వాహణే ముఖ్యమని భావించిన ఏఎస్సై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన వివరాలు బహిర్గతం చేయొద్దని ఏఎస్సై అభ్యర్ధించినట్టు చెబుతున్నారు. కర్నూల్ జిల్లాలో ఆయన ఏఎస్సైగా విధులు నిర్వరిస్తున్నట్టు చెబుతున్నారు. ఇక ఆన్‌లైన్ లోన్‌ యాప్స్ వేధింపుల కేసులో 16 మందిని అరెస్ట్ చేశారు. కీలక సూత్రదారి ల్యాంబో అలియాస్ జూబీనీ నిన్న ఢిల్లీ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news