ఈ బ్యాంకులో మీకు ఖాతా ఉందా….? అయితే ఇక మీకు బంపర్ ఆఫర్…!

-

బ్యాంక్ నుండి లోన్ తీసుకోవాలి అని మీరు ప్రయత్నం చేస్తున్నారా లేదా ఏమైనా మీరు కొనుక్కోవాలని ఆలోచిస్తున్నారా…? అయితే ఈ బంపర్ ఆఫర్ మీకు అందుబాటులో ఉంది. ఈ బంపర్ ఆఫర్ ఎక్కడి నుంచి వస్తుంది? అనే విషయానికి వస్తే కరూర్ వైశ్యా బ్యాంక్ సూపర్ బంపర్ ఆఫర్ ఖాతాదారులకు అందించింది. అయితే మీరు కొత్తగా ఏవైనా కొనుగోలు చేయాలనుకుంటే ఎన్నో దారులు మీకు అందుబాటులో ఉన్నాయి. అయితే దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా తన కస్టమర్లకు మంచి సేవలు అందించాలని వివిధ బ్యాంకుల తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం జరిగింది. దీని కారణంగానే కస్టమర్లు అదిరిపోయే బంపర్ ఆఫర్ ని పొందవచ్చు.

money

ఇదిలా ఉంటే మారుతి సుజుకి సంస్థకి టాటా మోటార్స్ పెద్ద షాక్ ఇచ్చింది. అసలు ఏం జరిగిందంటే టాటా మోటార్స్ కరూర్ వైశ్య బ్యాంకు తో జతకట్టింది. దీనితో టాటా ప్యాసింజర్ వెహికల్ కొనుగోలు చేయాలని అనుకునే వాళ్ళకి సులభంగా రుణం వస్తుంది. టాటా మోటార్స్ దేశ వ్యాప్తంగా ఉన్న షోరూంస్ లో, అలానే కరూర్ వైశ్య బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్లి కూడా మీరు ఈ లోన్ కి అప్లై చేసుకోవచ్చు.

అంతే కాకుండా రుణ గ్రహీతలు తొలి ఆరు నెలల పాటు ఎలాంటి ఈ ఎం ఐ కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనితో పాటు కార్స్ ని ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు కి పొందొచ్చు కానీ అన్ని మోడల్స్ కి ఈ ఫెసిలిటీ వర్తించదు. కేవలం టాటా టియాగో, టాటా నెక్సన్ , టాటా ఆల్టోజ్ వంటి మోడళ్లకు మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version