స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జోరు మొదలయింది. ఎన్నికలు ముందే ఏకగ్రీవం అయ్యాయి చాలా పంచాయితీలు. గుంటూరు మాచర్ల అత్యధిక స్థానాలు ఏకగ్రీవం చేసారు. మాచర్ల నియాజకవర్గంలోని 71 స్థానాల్లో 60 సీట్లు వైసీపీ కి ఏకగ్రీవం కావడం గమనార్హం. చాల ఎంపీటీసీ స్థానాల్లో ఒకటే నామినేషన్ దాఖలు అయింది. తూర్పు గోదావరి జిల్లాలో 6 చోట్ల వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. శ్రీకాకుళంలో 2 చోట్ల వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి.
వెల్దుర్తి మండలంలోని 14 స్థానాల్లో ఒకే నామినేషన్ దాఖలు అయింది. పలు మండలాల్లో వైసీపీ అభ్యర్ధులు మాత్రమే నామినేషన్ దాఖలు చేసారు. గుంటూరు జిల్లాలో అత్యధికంగా ఏకగ్రీవాలు జరిగాయి. నరసారావు పేటలోని 6 స్థానాల్లో ఒకే నామినేషన్ దాఖలు అయింది. రెంట చింతల 13 ,దుర్గి 12 ,మాచర్ల 9 ,కారంపూడి 9 ఏకగ్రీవం అయ్యాయి. ఇక రాయలసీమ గ్రామాల్లో కూడా ఇదే జోరు కొనసాగుతుంది.
సిఎం సొంత జిల్లాలో చాలా చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. రాజకీయంగా బలంగా ఉన్న వైసీపీ… ఏకగ్రీవాలు చేసుకుంటూ ముందుకి పోతుంది. మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ నేతలు అందరూ కూడా ఏకగ్రీవం దిశగా అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ఏకగ్రీవం అవుతున్నట్టు సమాచారం. ఆయన సొంత జిల్లా చిత్తూరు లో కూడా ఏకగ్రీవం అవుతున్నాయి పంచాయితీలు.