కరోనా ఎఫెక్ట్…ఆ దేశంలో 5.40 లక్షల మందికి క్వారంటైన్…!

కరోనా పుట్టినిల్లు చైనాలో మళ్లీ కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న ఒకరోజు చైనాలో 51 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అందులో బిజియాంగ్ ప్రావిన్స్ లోనే 44 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దాంతో అప్రమత్తం అయిన అధికారులు ఏకంగా 5.40 లక్షల మందిని క్వారంటైన్ లో ఉంచారు. అంతే కాకుండా కరోనా కేసులు నమోదు అవ్వడం తో ఇతరులకు వ్యాప్తి చెందకుండా 5.40 లక్షల మందిని క్వారంటైన్ లో ఉంచారు.

అదేవిధంగా స్థానికంగా లాక్ డౌన్ ను విధించారు. ఇదిలా ఉండగా చైనాలో ఫిబ్రవరి నెలలో వింటర్ ఒలంపిక్స్ జరగనున్నాయి. దాంతో ఒలంపిక్స్ ను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరోనా భయం పట్టుకుంది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా మళ్లీ దేశాల్లో ఆంక్షలు మొదలవుతున్నాయి. ఈ వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉండటం తో ఆందోళన నెలకొంది. దాదాపు అన్ని దేశాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదు అవుతున్నాయి.