ఆకురౌడీలకు భయపడకండి… ధైర్యంగా పోరాడండి…నేనున్నాంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. రాజకీయాల కోసం సొంత కుటుంబసభ్యులను చంపేసిన చరిత్ర వారిదని.. హింసా రాజకీయాలకు ప్రజాస్వామ్యంలో చోటులేదని ఫైర్ అయ్యారు. ఎంతమందిని చంపుతారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు…మనది 70లక్షల సైన్యమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరం కలసికట్టుగా తిరగబడితే పారిపోతారు…ఎవరూ భయపడొద్దన్నారు.
నెల్లూరు ప్రజలు ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించబోరని.. నేను ముందుండి పోరాడతా….నా వెనుక కలసి నడవండి….వారి సంగతి చూద్దామని భరోసా ఇచ్చారు బాబు. నెల్లూరు నగరాన్ని రూ.5 వే ల కోట్ల తో అభివృద్ధి చేశాం, 40వేల ఇళ్లు కట్టామని.. చేసినది చెప్పుకోవడంలో విఫలమయ్యామని పేర్కొన్నారు చంద్రబాబు. అధికార పార్టీ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలచడంలో విఫలమయ్యామని.. నాయకత్వ లోపం స్పష్టం కన్పిస్తోంది…ప్రక్షాళన చేసి తీరుతామని స్పష్టం చేశారు. 15 రోజు ల్లో సమర్థుల తో నెల్లూరులో అన్ని డివిజన్ లో కమిటీలు వేస్తామని పేర్కొన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.