కేంద్ర ప్రభుత్వం ముందు నుంచీ ఊహించినట్లుగానే దేశంలో లాక్‌డౌన్‌ను పొడిగించింది. మే 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మే 17వ తేదీ వరకు విధించిన 3వ విడత లాక్‌డౌన్ ఆదివారంతో ముగియగా.. మే 18 నుంచి లాక్‌డౌన్ 4.0 అమలులోకి రానుంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
భారత్‌లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో తొలుత మార్చి 25 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు తొలి విడత లాక్‌డౌన్ అమలు చేశారు. అనంతరం ఏప్రిల్ 15 నుంచి మే 3వ తేదీ వరకు రెండో విడత లాక్‌డౌన్ అమలైంది. మే 4 నుంచి 17 వరకు లాక్‌డౌన్ 3.0ను అమలు చేశారు. ఇక మే 18 నుంచి మే 31వ తేదీ వరకు లాక్‌డౌన్ 4.0 అమలు కానుంది. ఈ క్రమంలో కేంద్రం పలు నూతన మార్గదర్శకాలను కూడా ప్రవేశపెట్టింది.