తమిళనాడులో కరోనా విజృంభిస్తుంది. గత కొద్ది రోజుల నుంచి గరిష్ట స్థాయిలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించాలని ముఖ్య మంత్రి స్టాలిన్ ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా వస్తున్న నేపథ్యంలోనే జనవరి 23న రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధిస్తున్నామని తెలిపారు.
కరోనా వైరస్ ను కట్టడి చేయాలంటే ప్రజలే కరోనా నిబంధనలు పాటించాలని సూచించిచారు. ప్రతి ఒక్కరు మాస్క్, భౌతిక దూరం వంటి నియమాలను పాటించాలని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరు రెండు డోసుల వ్యాక్సిన్లను కూడా తీసుకోవాలని సూచించారు. అప్పుడే కరోనా వైరస్ దూరం అవుతుందని అన్నారు. కాగ తమిళనాడులో ప్రతి రోజు దాదాపు 30 వేలకు పైగా కరోనా కేసులు వస్తున్నాయి. గురు వారం కూడా 28,561 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆదివారం పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగ సోమవారం నుంచి తిరిగి అన్ని యధాతథంగా నడువనున్నాయి.