బీజేపీ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టో విడుదల

-

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ‘సంకల్ప్‌ పత్ర’ పేరుతో బీజేపీ మేనిఫెస్టో ప్రకటించింది. మోదీ గ్యారెంటీ, 2047 నాటికి వికసిత భారత్ థీమ్‌తో మేనిఫెస్టోను ప్రవేశపెట్టింది. దేశ ప్రగతి, యువత, మహిళలు, పేదలు, రైతులే అజెండాగా సంకల్ప్‌ పత్రను రూపొందించినట్లు బీజేపీ నేతలు తెలిపారు. రాజ్‌నాథ్ నేతృత్వంలోని 27 మంది సభ్యుల కమిటీ మేనిఫెస్టో రూపొందించింది. దీని కోసం 15 లక్షల సలహాలు, సూచనలను కమిటీ పరిశీలించింది.

ఈ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడారు. అంబేడ్కర్‌ జయంతి రోజు సంకల్ప్‌ పత్ర విడుదల సంతోషదాయకం అని నడ్డా అన్నారు. సామాజిక న్యాయం కోసం అంబేడ్కర్‌ జీవితాంతం పోరాడారని తెలిపారు. అంబేడ్కర్‌ సూచించిన మార్గంలో తాము కూడా నడుస్తున్నామని చెప్పారు. అంబేడ్కర్‌ ఆకాంక్షలను అమలు చేస్తున్నామన్న జేపీ నడ్డా.. 2014లో మోదీ ప్రధాని కాగానే పేదల కోసమే బీజేపీ సర్కార్‌ అని చెప్పారని గుర్తు చేశారు. వచ్చే ఐదేళ్లు దేశానికి ఎలా సేవ చేస్తామో తమ మేనిఫెస్టో చెబుతుందని అన్నారు. అందరినీ కలుపుకుని ముందుకెళ్తేనే దేశ ప్రగతి సాధ్యమని తమ విశ్వాసం ఉన్న నడ్డా.. మోదీ నేతృత్వంలో పదేళ్లుగా దేశం అభివృద్ధిలో పరుగులు తీస్తోందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news