సూర్య ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. త్వరలోనే వెట్రిమారన్‌ మూవీ షూటింగ్

-

తమిళ్ హీరో సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. సూర్య ప్రధాన పాత్రలో వెట్రిమారన్‌ దర్శకత్వంలో ‘వాడి వాసల్‌’ అనే సినిమాను మూడేళ్ల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్‌ నిలిచిపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ విషయంపై వెట్రిమారన్ క్లారిటీ ఇచ్చారు. వాడి వాసల్ మూవీ అప్డేట్ కూడా ఇచ్చి సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం తాను ‘విడుతలై పార్ట్‌2’ షూటింగ్లో బిజీగా ఉన్నానని, అది పూర్తయ్యాక ‘వాడి వాసల్‌’ రెగ్యులర్‌ షూట్‌ తిరిగి మొదలుపెడతానని చెప్పారు. ఆయన ధనుష్‌తో చేయనున్న ‘వడచెన్నై 2’ గురించి మాట్లాడుతూ.. దానికి చాలా సమయం పడుతుందని అన్నారు.

జల్లికట్టు ఇతివృత్తంగా ‘వాడి వాసల్‌’ తెరకెక్కనుంది. సూర్య, వెట్రిమారన్‌ తొలిసారి ఈ ప్రాజెక్ట్‌ కోసం కలిసి పని చేస్తున్నారు. 2021లోనే ఈ ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేసినప్పటికీ కరోనా కారణంగా షూటింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది. 2022లో షూట్‌ మొదలుకాగా.. సూర్యపై పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

Read more RELATED
Recommended to you

Latest news