ఢిల్లీ నుంచి విజయవాడకు చేరుకున్న నారా లోకేశ్

-

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టారు. లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, పార్టీ కార్యకర్తలను జాతీయ రహదారి వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాహనాలను రోడ్డుపైనే వదిలిన కార్యకర్తలు కాలినడకనే విమానాశ్రయం వద్దకు వెళ్లారు. విమానాశ్రయం నుంచి ఉండవల్లిలోని నివాసానికి లోకేశ్‌ బయల్దేరారు. చంద్రబాబు అరెస్ట్ అనంతరం ఢిల్లీకి వెళ్లిన టీడీపీ యువనేత ఇరవై రోజులకు పైగా అక్కడే ఉన్నారు.

న్యాయవాదులు, జాతీయ నాయకులతో సమావేశమవుతూ బిజీగా గడిపారు. ఈ రోజు ఆయన విజయవాడ చేరుకున్నారు. లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు విమానాశ్రయానికి వచ్చారు. వాహనాలపై వస్తోన్న కార్యకర్తలను మధ్యలోనే పోలీసులు అడ్డగించారు. దీంతో కార్యకర్తలు తమ వాహనాలను రోడ్డుపై వదిలి, నడుచుకుంటూనే విమానాశ్రయానికి చేరుకున్నారు. యువనేతకు ఘన స్వాగతం పలికారు. లోకేశ్ విమానాశ్రయం నుంచి ఉండవల్లిలోని తమ నివాసానికి బయలుదేరారు. లోకేశ్ రేపు ఉదయం రాజమండ్రి వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కేంద్రకారాగారంలో ఉన్న చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version