టీడీపీ పోరాటం కొనసాగుతుంది… తగ్గేదే లే : లోకేశ్‌

-

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఒక్క రోజు నిరాహార దీక్ష విరమించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా లోకేశ్ ఇవాళ ఢిల్లీలో దీక్ష చేపట్టారు. ఈ సాయంత్రం 5 గంటలకు దీక్ష ముగించిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏపీలో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో, ఇతర రాష్ట్రాల్లో అమలైన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టును చంద్రబాబు మన రాష్ట్రంలో కూడా తీసుకువచ్చారని వెల్లడించారు. 2.15 లక్షల మందికి స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి, అందులో 80 వేల మందికి ఉద్యోగాలు కల్పించారు. చంద్రబాబు నాడు యుద్ధప్రాతిపదికన పనిచేశారు కాబట్టే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని, కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దొంగకేసులు పెట్టి చంద్రబాబును జైలుకు పంపాలనే ప్రయత్నించిందని లోకేశ్ విమర్శించారు. ఏమీలేని స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో చంద్రబాబుపై దొంగ కేసు బనాయించి ఇవాళ్టికి 24 రోజులుగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచారని వెల్లడించారు.

‘‘మోత మోగిద్ధాం’’ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. అమ్మ భువనేశ్వరి శాంతియుతంగా దీక్ష చేయాలని కోరారు. ఆమె పిలుపు మేరకు దీక్ష చేశాం. ఇప్పటి నుంచి జగన్ పేరు మార్చాను.. ఆయన సైకో కాదు..పిచ్చి జగన్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారు, పిటీ వారెంట్ కూడా సిద్ధంగా పెట్టుకున్నారు. నాపై జగన్‌రెడ్డి మూడు కేసులు సిద్ధం చేశారు. కొందరు వైసీపీ మంత్రులు నన్ను జైలుకు పంపిస్తాం అంటున్నారు. వీలైతే అమ్మ భువనేశ్వరిని జైలుకు పంపిస్తా అంటున్నారు. మేము తగ్గేదేలే…. మా పోరాటం ఆగదు. ఇప్పటికీ నాపై మూడు కేసులు ఉన్నాయి. రోడ్డు లేని ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు. నా శాఖకు సంబంధ లేని నిర్ణయాలు. కోర్టులు మమ్మల్ని కాపాడుతాయి. పిచ్చోడు జగన్ చేసే నిర్ణయాలు ఇవి. అందుకే జగన్ పేరు పిచ్చి జగన్. రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసులో క్వాష్ పిటీషన్ వస్తుంది. కోర్టు నిర్ణయాలను బట్టి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం’ అని నారా లోకేష్ పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version