400 మీటర్ల హర్డిల్స్‌లో పీటీ ఉష రికార్డు సమం చేసిన విత్య

-

ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత షూటర్లు గురి చేసి కొట్టారు. ఇప్పటిదాకా భారత్‌ 42 పతకాలు సాధిస్తే, అందులో 22 పతకాలు కేవలం షూటింగ్‌లోనే వచ్చాయి. పురుషుల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో ఫైనల్ చేరిన కైనాన్ చెనయ్, కాంస్య పతకంతో భారత షూటర్ల ప్రస్తానం ఘనంగా ముగిసింది. స్కేటింగ్‌లో రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకోవడంతో భారత్ తమ రోజును అద్భుతంగా ప్రారంభించింది. మొదటిది స్పీడ్ స్కేటింగ్ 3000 మీటర్ల రిలేలో మహిళల జట్టు గెలుపొందగా, పురుషుల స్పీడ్ స్కేటింగ్ 300 మీటర్ల రిలేలో పురుషుల జట్టు రెండవది గెలుచుకుంది.

సోమవారం జరిగిన 400 మీటర్ల హర్డిల్స్‌ క్వాలిఫైడ్‌ రౌండ్స్‌లో 55.42 సెకన్‌ల టైమింగ్‌తో రేసును పూర్తిచేసింది. దాంతో అత్యంత వేగంగా ఈ రేసు పూర్తి చేసిన భారత మహిళగా పీటీ ఉష రికార్డును సమం చేసింది. దాంతోపాటు ఈ ఆసియా క్రీడల్లో ఫైనల్స్‌కు విత్య రామ్‌రాజ్‌ అర్హత సాధించింది. మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో అత్యంత వేగంగా పరుగెత్తిన భారత మహిళగా ఇప్పటి వరకు పీటీ ఉష పేరిట రికార్డు ఉంది. 1984లో జరిగిన ఒలింపిక్స్‌లో పీటీ ఉష 55.42 సెకన్‌ల టైమింగ్‌తో 400 మీటర్ల హర్డిల్స్‌ రేసు పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. అప్పటి నుంచి దాదాపు 39 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డును ఇప్పుడు విత్య రామ్‌రాజ్‌ సమం చేసింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version