పోయ్యిలో ఉప్పులా ఏపీలో రెండు పార్టీల మధ్య చిటపట ఎప్పుడూ కొనసాగుతూనే ఉంది.. ఇటు టీడీపీ, అటు వైసీపీ.. ఒకరికొకరు వారి వారి లోపాపలను ఎత్తి చూపించుకోవడం నిత్యం ఏదో ఒకరూపంలో జరుగుతూనే ఉంది.. ఈ నేపధ్యంలో నారా లోకేశ్ మరోసారి చిత్రమై వాఖ్యలు చేశారు.. ఇప్పటికే ఫేక్ ట్వీట్‌ల కష్టాలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న లోకేశం.. మార్ఫింగ్ ట్వీట్లతో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఎగిరెగిరి పడుతున్నారు.. తనపై ఫేక్ ట్వీట్‌లతో ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని.. ఇదంతా వైఎస్సార్‌సీపీ పనంటూ మండిపడ్డారు.
అంతే కాకుండా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గారికి మ్యాటర్ వీక్ అనే విషయం పేటిఎమ్ బ్యాచ్‌కి అర్థం అయిపోయింది. అందుకే 5 రూపాయిల చిల్లర కోసం తుప్పు పట్టిన బుర్రలకు పనిపెట్టి టీడీపీ అధ్యక్షుడు ఎంపికలో నాయకుల మధ్య వివాదం అంటూ ఫేక్ అకౌంట్లతో రచ్చ చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడుతో తమకు ఉన్న అనుబంధం అన్నదమ్ముల వంటిదని అలాంటి మా మధ్య గొడవలు పెట్టాలని ప్రయాస పడుతున్న పేటీఎం బ్యాచ్ పప్పులు ఉడకవని, వీరంత చేసే ప్రయత్నం వ్యర్ధమని ఆయన పేర్కొన్నారు.. ఇక ఇలాంటి చిల్లర బ్యాచ్ చేసే పనుల వల్ల టీడీపీ నాయకుల మధ్య బంధం మరింత బలపడుతుందని అన్నారు. ఇకపోతే సోషల్ మీడియాలో టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు పేరుతో ఓ ట్వీట్ కలకలంరేపింది. టీడీపీ అధ్యక్ష పదవికి రామ్మోహన్ రాజీనామా ఇస్తున్నారని వచ్చిన వార్తల నేపధ్యంలో లోకేశ్ ఇలా స్పందించారు..