కేంద్ర ప్రభుత్వ చేసిన వ్యవసాయ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రయాణీకుల రవాణా ఆదాయంలో 67 కోట్ల రూపాయలతో సహా వారి నిరసనల వలన మొత్తం 2,220 కోట్ల నష్టాన్ని చవిచూశామని రైల్వే తెలిపింది. సెప్టెంబర్ 24 న ప్రారంభమైన ఈ నిరసనలు 3,850 సరుకు రవాణా రైళ్లను ప్రభావితం చేశాయి. ఇప్పటివరకు 2,352 ప్యాసింజర్ రైళ్లు రద్దు చేయబడ్డాయి.
ఇక రాష్ట్రంలో సరుకు రవాణా రైళ్లను మాత్రమే నడపడానికి అనుమతిస్తామని నిరసనకారులు చేసిన ప్రతిపాదనను జాతీయ రవాణాదారుల సంఘం తిరస్కరించడంతో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు, రైల్వేకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయడం వల్ల వచ్చే నష్టం ₹ 67 కోట్లు. కానీ ఐఆర్ స్థాయిలో మొత్తం ఆదాయ నష్టం మాత్రం 2,220 కోట్లు ఉంటుందని రైల్వే తెలిపింది. ఈ ప్రాంతాన్ని మొత్తం కవర్ చసె ఉత్తర రైల్వేకు రోజుకు ఇప్పటి దాక 891 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది, సగటున రోజుకు 14.85 కోట్లు నష్టపోయింది. అక్టోబర్ 1 నుండి నవంబర్ 19 వరకు, రైళ్లు రద్దు చేయడం వల్ల సరుకు రవాణా లోడింగ్ ఆగిపోయింది. లడఖ్ మరియు జమ్మూ కాశ్మీర్ కి అవసరమైన వస్తువులను తీసుకువెళుతున్న చాలా మంది పంజాబ్ శివార్లలోనే చిక్కుకుపోయారు.