కాస్త ఆశ్చర్యంగా అనిపించినా నిజమే. ఇప్పుడు అంటే రెండు దేశాలు అయ్యాయి కానీ బ్రిటిష్ రూల్ సమయంలో రెండు దేశాలు కలిసి ఉండేవి. అయితే స్వార్ద పాలకుల రాజకీయాల కోసం దేశాన్ని ముక్కలు గా విభజించారు. ఈ దెబ్బకు ఇండియాలో ముస్లింలు మైనారిటీలుగా బ్రతుకుతుంటే, పాకిస్తాన్ లో హిందువులు మైనారిటీలుగా నరకం అనుభవిస్తున్నారు. అయితే తాజాగా పాకిస్తాన్లోని కరాచి జిల్లాకు సమీపంలో ఇటీవల జరిపిన పురావస్తు శాఖ తవ్వకాల్లో పురాతనమైన హిందూ దేవాలయం ఒకటి బయటపడింది.
స్వాత్ జిల్లాలోని బరీకోట్ ఘుండాయ్ ప్రాంతంలో ఈ తవ్వకాలను చేపట్టగా గురువారం నాడు 1300 ఏళ్ల నాటి పురాతన హిందూ దేవాలయం వెలుగు చూసింది. ఇది శ్రీమహావిష్ణువు ఆలయంగా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆలయం దాదాపు 1300 ఏళ్ల నాటిదని, హిందూ షాహి రాజ్యంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు. అంతే కాక ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ఆలయ పరిసరాల్లో ఒక కంటోన్మెంట్, వాచ్‌టవర్ జాడలు కూడా పురావస్తు శాఖ అధికారులు కనుగొన్నారు. స్వాట్ జిల్లాలో వెయ్యేళ్ల కిందటి పురావస్తు ప్రదేశాలు ఉండగా.. తొలిసారి 1300 ఏళ్ల నాటి నాటి జాడలు కనిపించాయని చెబుతున్నారు.