దేశంలో ఇప్పుడు అనేక అవసరాలకు మనకు ఆధార్ ఉపయోగపడుతోంది. గతంలో దీన్ని కేవలం వంట గ్యాస్ సబ్సిడీ పొందేందుకు, ఐడీ ప్రూఫ్ కోసం వాడేవారు. కానీ ఇప్పుడు అనేక పనులకు ఆధార్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే కొందరు ఆధార్ కార్డును పోగొట్టుకుంటుంటారు. అలాగే ఎన్‌రోల్‌మెంట్ నంబర్ కూడా గుర్తుండదు. దీంతో ఆధార్ ను ఎలా తిరిగి సంపాదించాలో అర్థం కాక సతమతం అవుతుంటారు. అలాంటి వారు ఈ విధంగా చేస్తే తిరిగి ఆధార్‌ను పొందవచ్చు. అందుకు ఏం చేయాలంటే…
ఆధార్ కార్డు, ఎన్‌రోల్‌మెంట్ నంబర్ పోయిన వారు ఆధార్ హెల్ప్ లైన్ నంబర్ 1947కు కాల్ చేసి సహాయం పొందవచ్చు. లేదా ఆన్‌లైన్‌లో కింద తెలిపిన విధంగా స్టెప్స్ పాటించినా ఆధార్‌ను తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుంది.
స్టెప్ 1: యుఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
ప్టెప్ 2: హోం పేజీలో రిట్రీవ్ లాస్ట్ యూఐడీ, ఈఐడీ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
స్టెప్ 3: అక్కడ మీకు రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. రిట్రీవ్ ఆధార్ నంబర్ (యూఐడీ) లేదా రిట్రీవ్ ఆధార్ ఎన్‌రోల్ మెంట్ నంబర్ (ఈఐడీ). రెండింటిలో దేన్నయినా ఎంచుకుని క్లిక్ చేయాలి.
స్టెప్ 4: అక్కడ అడిగే అన్ని వివరాలను ఎంటర్ చేయాలి. పేరు, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌లను ఎంటర్ చేయాలి.
స్టెప్ 5: పేజీలో ఎడమ వైపు కనిపించే విభాగంలో ఆధార్ నంబర్‌ను ఎంచుకోవాలి. దీంతో మొబైల్ కు ఆధార్ నంబర్‌ను పంపిస్తారు.
స్టెప్ 6: వెరిఫికేషన్ కాప్చాను ఎంటర్ చేయాలి.
స్టెప్ 7: సెండ్ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 8: ఓటీపీని వెరిఫై చేయాలి.
స్టెప్ 9: మీ ఆధార్ నంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ నంబర్ ను మొబైల్‌కు పంపిస్తారు.
అయితే ఈ విధానంలో ఆధార్ నంబర్‌ను లేదా ఎన్‌రోల్‌మెంట్ నంబర్‌ను తెలుసుకోవాలంటే ఆధార్‌కు కచ్చితంగా మొబైల్ లింక్ అయి ఉండాలి. లేదంటే పోయిన ఆధార్ కార్డు కోసం ఆధార్ కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది.