కారు తో బీభత్సము సృష్టించిన మహిళా …ప్రమాదం లో చిన్నారి ..!

-

మహిళా నిర్లక్ష్యం వలన ఓ చిన్నారి ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు .ఓల్డ్ సిటీలో జరిగిన ఒక ప్రమాదం వీడియో ప్రజలలో భయాందోళనలు పుట్టిస్తుంది . ఈ ప్రమాదం లో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు . పాత బస్తి షంషేర్ గూంజ్ కలపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్ సమీపం లో కారు బీభత్సము సృష్టించింది .ఇంటి ముందు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారుల మీదికి కారు రివర్స్ గ దూసుకొచ్చింది . దీంతో కారుకి గోడకి మధ్య లో చిక్కు కున్న మహమ్మద్ ఆసిఫ్ అనే చిన్నారి కి తీవ్ర గాయాలు అయి రెండు కాళ్ళు విరిగిపోగా ఇంకో చిన్నర్రి తృటిలో తప్పించుకున్నాడు .

ప్రమాదానికి కారణమైన కార్ ను ఒక మహిళా నడుపుతుంది .ఆ సదరు మహిళా ఇటీవలే యూఏఈ నుంచి ఇక్కడికి వాచినట్టు సమాచారం .సంఘటనను గుర్తించిన తరువాత, స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని కార్ ని వెనక్కి తీసి బాలుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకి సంబంధించి పోలీస్ లు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపినట్టు సమాచారం .

దీంతో ఇంట్లో కూర్చున్న ప్రమాదం సంభవిస్తుందని ప్రజలు భయపడుతున్నారు .నిందితులకు కఠినంగా శిక్షపడాలని స్థానికులు కోరుతున్నారు ఈ సంఘటన సమీపంలోని సిసిటివి కెమెరాల్లో బంధించి బడిన ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news