EPFO: ఈ పొరపాటు చేస్తే రూ.7 లక్షలు పోతాయి..!

-

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ చర్యలు తీసుకుంటోంది. చందాదారుల కోసం మూడు రకాల పథకాలను ఇస్తున్న విషయం తెలిసిందే. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ దానిలో ఒకటి. రెండోది పెన్షన్ స్కీమ్. మూడోది ఎంప్లాయి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇవి తప్పకుండా తెలుసుకోవాలి. లేదంటే ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. ఎంప్లాయి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకంలో భాగంగా ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారుడు చనిపోతే నామినీకి రూ. 7 లక్షల వరకు ప్రయోజనము అందుతుంది.

అందుకోసం తప్పనిసరిగా ఇ- నామినేషన్ ని పూర్తి చేయాలి. సర్వీసులో ఉండగా అతను చనిపోతే కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ రక్షణగా ఈపీఎఫ్ అందించే ప్రయోజనాల్లో ఈడీఎల్ఐ ఒకటి. పీఎఫ్ చందా చెల్లిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి ఇన్సూరెన్స్ ఉంటుంది. so ఇ- నామినేషన్ తప్పని సరిగా పూర్తి చేసుకోవాలి. ఈపీఎస్, ఈపీఎఫ్ పథకాల్లో ఉద్యోగి కొంత చెల్లిస్తాడు. ఈడీఎల్ఐలో మాత్రం ఉద్యోగి తరపున పని చేస్తున్న కంపెనీ యాజమాన్యం పే చేస్తుంది.

ఈ ప్రయోజనాన్ని ఉద్యోగులు పొందాలంటే ఏదైనా కంపెనీలో ఏడాది పాటు పని చేయాలి. ఏడాదిలోపు ఉద్యోగులు అయితే అనర్హులు. సర్వీసులో ఉండగానే చనిపోతే నామినీలు తప్పనిసరిగా పీఎఫ్, పెన్షన్ విత్ డ్రా, ఈడీఎల్ఐలను క్లెయిమ్ చేయాలి. యావరేజ్ మంత్లీ శాలరీ గరిష్ఠంగా రూ. 15 వేలు అయితే… దానికి 35 రెట్లు 35xరూ.15,000= రూ.5.25 లక్షలు. దాంతో పాటు ఆర్గనైజేన్ బోనస్ కింద రూ. 1.75 లక్షలు. మొత్తంగా రూ. 7 లక్షలు ని పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news