ఆస్తిపత్రాలు పోగొట్టుకున్నారా..అయితే డూప్లికేట్‌ డాక్యుమెంట్స్ ఎలా పొందాలంటే..!

-

ఆస్తిపత్రాలు ఎంత ముఖ్యమో మనందరికి తెలిసిన విషయమే.. కొన్నిసార్లు ఆస్తులు ఉన్నా..వాటికి సంబంధించి పత్రాలు లేకుంటే ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఆస్తిపత్రాలు లేకుంటే క్రయవిక్రయాలు జరపటం చాలాకష్టమైన పనే. కానీ అగ్నిప్రమాదాల్లోనో,చోరీ చేసే ఆస్తిపత్రాలను పోగొట్టుకుంటుంటారు. అటువంటి సందర్భాల్లో వెంటనే డూప్లికేట్ డాక్యుమెంట్లను తయారుచేసుకోవాలి. ఎలాగో ఇప్పుడు చూద్దాం.

 1. FIR ఫైల్ చేయాలి.

కాగితాలు పోయినా లేదా దొంగిలించారని తెలిసిన వెంటనే దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలి. ఎఫ్‌ఐఆర్‌లో పేపర్లు పోయాయన్న కాపీని మీ వద్ద ఉంచుకోవాలి. ఈ కాపీ భవిష్యత్‌లో ఉపయోగపడుతుంది.

2. వార్తాపత్రికలో నోటీసును ముద్రించండి

 నెక్స్ట్ స్టెప్ వార్తాపత్రికలో తప్పిపోయిన కాగితం గురించి నోటీస్‌ ఇవ్వాలి. ఏంటి పేపర్ లో ఇవ్వాలా అనుకుంటున్నారా..అవును ఇవ్వాల్సి ఉంటుంది.. ఆస్తికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నోటీసు అవుతుంది. పోగొట్టుకున్న కేసుల్లో అయితే.. తదుపరి 15 రోజులు వేచి ఉండండి. ఎందుకంటే ఎవరైనా పేపర్‌లను పొంది ఉండవచ్చు ఆ సమయంలో దానిని తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ నోటీసు ఆంగ్ల వార్తాపత్రిక, ప్రాంతీయ వార్తాపత్రిక రెండింటిలోనూ ఇవ్వాలట.

3. డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ పొందాలి

మీరు హౌసింగ్ సొసైటీలో నివసిస్తుంటే రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ లేదా RWA నుంచి డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ ను తీసుకోవచ్చు.. RWA నుంచి డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్ పొందడానికి మీరు ఎఫ్‌ఐఆర్ కాపీని, వార్తాపత్రికలో ముద్రించిన నోటీసు క్లిప్పింగ్‌ను అందించాల్సి ఉంటుంది. దీని తర్వాత RWA సమావేశాన్ని ఏర్పాటు చేసి పత్రాలను పరిశీలించి, సంఘటన నిజమని తేలితే షేర్ సర్టిఫికేట్ జారీ చేస్తారు.

4. చట్టపరమైన మార్గాన్ని అనుసరించండి

ప్రాపర్టీ పేపర్ కోసం స్టాంప్ పేపర్‌పై చేసిన అండర్‌టేకింగ్‌ను పొందాల్సి ఉంటుంది.. దీనిలో ఆస్తి గురించి పూర్తి సమాచారం ఉంటుంది. తప్పిపోయిన పేపర్లు, ఎఫ్‌ఐఆర్, వార్తాపత్రిక నోటీసులను ఇవ్వాలి. నోటరీ ద్వారా ఆమోదించి ఆపై రిజిస్ట్రార్ కార్యాలయానికి సమర్పించాలి.

5. డూప్లికేట్ ప్రాపర్టీ పేపర్‌లను పొందండి

ఇవన్నీ చేసిన తర్వాత మీరు రిజిస్ట్రార్ కార్యాలయంలో మీ ఆస్తి కోసం నకిలీ సేల్ డీడ్‌తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.. దీని కోసం ఎఫ్‌ఐఆర్ కాపీ, వార్తాపత్రికలో ఇచ్చిన ప్రకటన, డూప్లికేట్ షేర్ సర్టిఫికేట్, నోటరీ మొదలైనవాటిని రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించాలి. కొంత రుసుము వసూలు చేస్తారు. అనంతరం మీ పేరు మీద డూప్లికేట్ సేల్ డీడ్ జారీ చేస్తారు.
ఇదీ ప్రాసెస్..ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చేయాల్సి ఉంటుంది. మీరు లీగల్ గా వెళ్తేనే తక్కువ ఖర్చులో అయిపోతుంది. ఇదే ప్రాసెస్ ని మీరు బ్రోకర్స్ కి అప్పచెప్తే..మీరు నష్టపోక తప్పదు.

Read more RELATED
Recommended to you

Latest news